COVID-19 Vaccine: కేంద్రం కీలక నిర్ణయం, 45 పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకాలు

COVID-19 Vaccines For People Above 45 Age From April 1: ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 23, 2021, 04:02 PM IST
  • దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని ప్రకటన
  • కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్ర నిర్ణయం
COVID-19 Vaccine: కేంద్రం కీలక నిర్ణయం, 45 పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకాలు

COVID-19 Vaccines :దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60ఏళ్లు పైబడిన అందరికీ, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అందిస్తోంది. ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ నిర్ణయాన్ని వెల్లడించారు. భౌతికదూరం పాటించాలని, బయటకు వెళితే కచ్చితంగా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను కోరింది. కోవిడ్-19(COVID-19 Vaccine) నిబంధనలు తప్పక పాటించాలని, లేకపోతే కరోనా కేసులు భారీగా పెరుగుతాయని హెచ్చరించింది.

Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదు, GHMCలో విజృంభిస్తోన్న కోవిడ్ మహమ్మారి

ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 వయసు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మండలి సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 40,715 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల(CoronaVirus) సంఖ్య 1,16,86,796కు చేరింది. తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రల్లోనే 80.90 శాతం కేసులు నమోదు కావడం గమనార్హం.

Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఖాతాదారులు EPF Balance వివరాలు తెలుసుకోవచ్చు 

ప్రస్తుతం దేశంలో 40 వేల వరకు కరోనా పాజిటివ్ నమోదు అవుతున్నాయి. అందులో 60 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర నుంచే నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజా కేసులలో అత్యధికంగా మహారాష్ట్రంలో 24,645 కేసులు, ఆ తరువాత పంజాబ్ 2,299, గుజరాత్ నుంచి 1,640 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News